12 ఏళ్లలోపు చిన్నారులకు కొవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వినియోగానికి సిఫార్సు

  • 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం కొర్బెవ్యాక్స్
  • 6-12 ఏళ్లలోపు పిల్లల కోసం కొవాగ్జిన్ టీకా అభివద్ధి
  • రెండు టీకాలను వినియోగించవచ్చంటూ నిపుణుల కమిటీ సిఫార్సు
5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొర్బెవ్యాక్స్, భారత్ బయోటెక్ టీకా ‘కొవాగ్జిన్‌’ వినియోగానికి ‘ఎన్‌టాగి’ స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. కొర్బెవ్యాక్స్‌ను 5-12 ఏళ్లలోపు పిల్లలకు వేయనుండగా, కొవాగ్జిన్‌ టీకా 6-12 ఏళ్ల మధ్య చిన్నారులకు ఉద్దేశించినది.

6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్ బయోటెక్‌కు ఏప్రిల్ 26న అనుమతి మంజూరు చేసింది. అదే నెలలో డీసీజీఐ నిపుణుల ప్యానెల్ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.


More Telugu News