అమెరికా టూర్‌లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి... పత్తి సాగును పరిశీలించిన సింగిరెడ్డి
- ఎమ్మెల్యేలు రవీంద్ర, ఆనంద్‌లతో కలిసి అమెరికా వెళ్లిన సింగిరెడ్డి
- అమెరికా వ్యవసాయంపై అధ్యయనం కోసం వెళ్లిన బృందం
- టెక్సాస్‌లో విత్తన పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి అమెరికా వెళ్లిన సింగిరెడ్డి.. అక్కడి వ్యవసాయ పద్ధతులు, నూతన సాగు పద్ధతులు, విత్తన ఉత్పత్తి, విత్తన శుద్ధి తదితరాలను పరిశీలిస్తున్నారు. అమెరికా సాగు పద్ధతులపై అధ్యయనం కోసమే సింగిరెడ్డి బృందం ఆ దేశానికి వెళ్లింది.
ఇందులో భాగంగా శుక్రవారం టెక్సాస్‌లో కొనసాగుతున్న పత్తిసాగును సింగిరెడ్డి బృందం పరిశీలించింది. టెక్సాస్ పరిధిలోని మెకానికల్ విశ్వవిద్యాలయంలో విత్తన పరిశోధన కేంద్రాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ వివరాలను మంత్రి నిరంజన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.