కాంగ్రెస్‌లో చేరిపోయిన జిగ్నేష్ మేవానీ... గుజ‌రాత్ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామ‌కం

  • రాష్ట్రీయ ద‌ళిత్ అధికార్ మంచ్‌ను స్థాపించిన మేవానీ
  • ఆ పార్టీ త‌ర‌ఫున‌నే ఎమ్మెల్యేగా గెలిచిన వైనం
  • సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో అరెస్ట్, విడుద‌ల‌
ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్న గుజ‌రాత్ ఎమ్మెల్యే, ఉద్య‌మ‌కారుడు జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను గుజ‌రాత్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (జీపీసీసీ)లో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌న‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించిన కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ మేవానీ శుక్ర‌వారం ఓ ట్వీట్ చేశారు.

ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగిస్తున్న మేవానీ... రాష్ట్రీయ ద‌ళిత్ అధికార్ మంచ్ పేరిట ఓ రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ త‌ర‌ఫున‌నే గుజ‌రాత్‌లోని వ‌డ్గ‌మ్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యే హోదాలో ఆయ‌న ద‌ళితుల స‌మ‌స్య‌ల‌పై మ‌రింత‌గా పోరు సాగిస్తున్న వైనం తెలిసిందే. ఇటీవ‌లే సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశారంటూ ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్‌పై విడుద‌లైన మేవానీ... ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోవ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News