తెలంగాణలో భారీ వర్షాలు... మహబూబ్ నగర్ జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు
- క్రియాశీలకంగా నైరుతి రుతుపవనాలు
- మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు
- మాచన్ పల్లి-కోడూరు మార్గంలో ఘటన
- రైల్వే అండర్ బ్రిడ్జి జలమయం
- ముందుకు కదల్లేకపోయిన బస్సు
- విద్యార్థులను కాపాడిన స్థానికులు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాచన్ పల్లి-కోడూరు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరగా, అందులో ఓ స్కూలు బస్సు చిక్కుకుపోయింది.
ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు రామచంద్రపురం నుంచి సుగురు తండాకు వెళ్తుండగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి నీటి ప్రవాహంలో ముందుకు కదల్లేకపోయింది. బస్సు సగానికి నీళ్లు వచ్చేయడంతో విద్యార్థులు భయంతో హాహాకారాలు చేశారు. అయితే, స్థానికులు వెంటనే స్పందించి, బస్సులో చిక్కుకున్న విద్యార్థులను కాపాడారు. అనంతరం, బస్సును ఓ ట్రాక్టర్ కు కట్టి వరద నీటి ఉంచి బయటికి లాగారు.