జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత... నిర్ధారించిన అధికారులు
- నరా నగరంలో సభలో అబే ప్రసంగం
- కాల్పులు జరిపిన దుండగుడు
- కుప్పకూలిన మాజీ ప్రధాని
- మెడ భాగంలో బుల్లెట్ గాయాలు
- తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిపాలు
నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తూ దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూశారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలి అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా, వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయిందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని షింజో అబే మరణించారని వారు నిర్ధారించారు.
మెడ భాగంలో తగిలిన బుల్లెట్లు తీవ్ర రక్తస్రావానికి కారణమైనట్టు భావిస్తున్నారు. షింజే అబే ను ఆసుపత్రిలో చేర్చే సమయానికే అత్యంత విషమపరిస్థితిలో ఉన్నారు. ఆసుపత్రిలో రక్తం ఎక్కించినా ప్రయోజనం లేకపోయింది. కాల్పులు జరిగినప్పుడే ఆయన మృతి చెందారని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి.