మా పూర్వీకులు హిందువులు.. వారు ఇస్లాంలోకి వచ్చారు: ముస్లిం ఎంపీ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు
- ఈద్ ఉల్ అదా రోజున ముస్లింలు గోవధ చేయవద్దన్న అజ్మల్
- హిందువుల మనోభావాలను గౌరవిద్దామని పిలుపు
- ఈద్ పండుగను ముస్లింలతో కలిసి జరుపుకుంటామని వెల్లడి
అసోం ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బద్రుద్దీన్ అజ్మల్ బక్రీద్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వారం ఈద్ ఉల్ అదా సందర్భంగా ఆవులను వధించవద్దని ముస్లింలను కోరారు. తమ పూర్వీకులందరూ హిందువులేనని, వారు ఇస్లాంలోకి మారారని చెప్పారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ... ఈద్ ఉల్ అదా రోజున ఆవులను వధించవద్దని అన్నారు. గువాహటిలో మీడియాతో మాట్లాడుతూ, ఈద్ పండుగను హిందువులతో కలిసి జరపుకుంటామని చెప్పారు.
మహమ్మద్ ప్రవక్త గురించి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ముస్లింలు ప్రతిస్పందించవద్దని అజ్మల్ అన్నారు. నుపుర్ శర్మ వంటి వారికి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థించాలని చెప్పారు. శిరచ్ఛేదాలు చేయడం మూర్ఖమైనటువంటి చర్య అని అన్నారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ రెండు మతాల మధ్య ఐక్యతను ఆరెస్సెస్ విచ్ఛిన్నం చేయలేదని అన్నారు.