కోహ్లీకి దారులు మూసుకుపోతున్నాయా..? టీ20లో చోటు కష్టమేనా ఇక..?
- ఐర్లాండ్ సిరీస్ లో కోహ్లీ లేకుండానే గెలుపు
- ఇంగ్లండ్ తో మొదటి టీ20లోనూ అంతే
- కనుక మిగిలిన టీ20లకు చోటు కష్టమేనన్న అభిప్రాయం
ఇంగ్లండ్ తో మొదటి టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ లేని లోటు ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం కోహ్లీ ఫామ్ కోల్పోయి చాలా కాలం కావడమే. కోహ్లీకి బదులు మూడో స్థానంలో వచ్చిన దీపక్ హుడా 17 బంతులకు 33 పరుగులు దంచి కొట్టి అవుటయ్యాడు. ఐర్లాండ్ తో రెండు టీ20ల్లో దీపక్ హుడా సత్తా చాటాడు. ఒకదానిలో అర్ధ సెంచరీకి చేరువ కాగా, మరో దానిలో సెంచరీ కొట్టేశాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి పొట్టి జట్టులో ఇక చోటు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కేవలం రెండే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. శనివారం బర్మింగ్ హమ్ లో ఇంగ్లండ్, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. కోహ్లీ రెండో టీ20 నుంచి సెలక్షన్ కు అందుబాటులో ఉండనున్నాడు. వాస్తవానికి కోహ్లీకి చోటు లభించాలి.. కానీ, కోహ్లీకి మంచి పోటీనిచ్చే కుర్రాళ్లు చాలా మంది తయారయ్యారు. ఐపీఎల్ 2022 సీజన్ లోనూ కోహ్లీ 22.73 సగటు బ్యాటింగ్ రేటుతో నిరాశపరచడం తెలిసిందే.
దీనిపై మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘భారత్ మొదటి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ మిగిలిన మ్యాచ్ లకు పెద్దగా మార్పులు చేయకపోవడం గతంలో చూశాం. కనుక వారు మిగిలిన మ్యాచ్ లకు మార్పులు చేస్తారని అనుకోవడం లేదు. మహా అయితే ఒక మార్పు ఉండొచ్చు. అర్షదీప్ రెండో మ్యాచ్ కు ఉండడం లేదు. దీంతో బుమ్రా రానున్నాడు’’ అని పేర్కొన్నాడు. ఆఖరి టెస్ట్ మ్యాచ్ కు బుమ్రా సారథ్యం వహించడం తెలిసిందే.