మ్యాక్ బుక్ ఎయిర్ ఎం2 బుకింగ్ లు నేటి నుంచే
- ధరలు రూ.1,19,000 నుంచి ఆరంభం
- రెండు రకాల వేరియంట్లలో లభ్యం
- విద్యార్థులకు చక్కని డిస్కౌంట్ కే విక్రయం
ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన ‘మ్యాక్ బుక్ ఎయిర్ ఎం2’ కోసం యాపిల్ నేటి నుంచి భారత్ లో బుకింగ్ లను అనుమతిస్తోంది. యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో సాయంత్రం 5.30 గంటల వరకు ముందస్తు ఆర్డర్లు ఇవ్వొచ్చు. యాపిల్ అధీకృత విక్రయదారుల వద్ద కూడా బుకింగ్ కు అవకాశం ఉంటుంది. ఈ నెల 15 నుంచి మ్యాక్ బుక్ ఎయిర్ ఎం2 విక్రయాలు అధికారికంగా మొదలవుతాయి.
దీని ఆరంభ ధర రూ.1,19,000. 8జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. ఇక 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీతో కూడిన వేరియంట్ ధర రూ.1,49,000. కానీ, ఇదే వేరియంట్ విద్యార్థులకు అయితే కేవలం రూ.1,09,000కే లభిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు తమ కాలేజీ ఐడీ కార్డుతో బుక్ చేసుకోవాలి. యాపిల్ స్టూడెంట్ ప్రోగ్రామ్ కింద ఈ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
ఇకపోతే, మిగిలిన మ్యాక్ బుక్ మాదిరే వీటి డిజైన్ కూడా ఉంది. యాపిల్ నూతన ఎంటీ చిప్ పై ఇవి పనిచేస్తాయి. 13.1 అంగుళాల సైజుతో వస్తుంది. ఇందులో మ్యాగ్నెటిక్ సేఫ్ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇక బేసిక్ వేరియంట్ తో 30 వాట్ చార్జర్ వస్తే, హై ఎండ్ వేరియంట్ తో 35 వాట్ చార్జర్ వస్తుంది. 67 వాట్ టైప్ సీ చార్జర్ కు అప్ గ్రేడ్ ఆప్షన్ ను యాపిల్ అందిస్తోంది.