షింజో అబేను బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు: జపాన్ ప్రధాని కిషిదా
- నరా నగరంలో అబేపై కాల్పులు
- కుప్పకూలిన అబే
- ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
- పరిస్థితి విషమం
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగిన ఘటన జపాన్ ప్రజలను నిశ్చేష్టకు గురిచేసింది. ప్రశాంత దేశంగా పేరుపొందిన జపాన్ లో ఇలాంటి ఘటన జరగడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, షింజే అబే ప్రస్తుత పరిస్థితిపై జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా స్పందించారు.
ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న అబేను బతికించేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకుంటామని కిషిదా స్పష్టం చేశారు. ఓ ఎన్నిక నేపథ్యంలో అబేపై జరిగిన ఈ దాడి హీనమైన అటవిక చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య జపాన్ లో ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.