వైసీపీ నేతల అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలయింది: నారా లోకేశ్
- వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ ఆత్మహత్యకు పాల్పడిందన్న లోకేశ్
- దీనికి కారకులైన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్
- జగన్ పాలనలో పోలీసులు, అధికారులకు ఇదే గతి పట్టొచ్చని వ్యాఖ్య
జగన్ రెడ్డి అండతో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి కావడం రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకి పాల్పడిందని ఆరోపించారు.
ఎస్టీ మహిళా ఉద్యోగిని వేధించి బలవన్మరణానికి కారకులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ నుంచి భవానీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలేనని అన్నారు. ఈ హత్యలని తప్పుదారి పట్టిస్తూ, నిందితులైన వైసీపీ నేతలని కాపాడుతున్న పోలీసులు, అధికారులకు కూడా జగన్ రెడ్డి క్రూర పాలనలో ఇదే గతి పట్టొచ్చని చెప్పారు. వైసీపీ బాధితులైన సాటి ఉద్యోగులకి అండగా నిలవాలని ఉద్యోగులను ఆయన కోరారు.