పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. ఇండియా కరోనా అప్డేట్స్!
- గత 24 గంటల్లో 18,815 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 38 మంది మృతి
- 1,22,335కి చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 18,815 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 15,899 మంది కరోనా నుంచి కోలుకోగా... 38 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసులు 1,22,335కి పెరిగాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,35,85,554కి చేరాయి. అలాగే 4,29,37,876 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,343 మంది మృతి చెందారు.
దేశంలో పాజిటివిటీ రేటు 4.96 శాతంగా, రికవరీ రేటు 98.51 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.28 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,98,51,77,962 డోసులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 17,62,441 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.