నాలుగు దశాబ్దాల తర్వాత నగరిపల్లెలో అడుగుపెట్టిన చంద్రబాబునాయుడు.. అప్పుడూ ఇప్పుడూ ఒకే ఇంటికి!
- అప్పట్లో కాంగ్రెస్ నేతగా, ఇప్పుడు టీడీపీ అధినేతగా గ్రామంలో అడుగుపెట్టిన ‘బాబు’
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత
- హారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న చిత్తూరు జిల్లాలోని నగరిపల్లెకు చేరుకున్నారు. ఆయనీ గ్రామానికి రావడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతగా వచ్చిన ఆయన ఇప్పుడు టీడీపీ అధినేతగా గ్రామంలో అడుగుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.
40 ఏళ్ల క్రితం కూడా చంద్రబాబు వారింటికే వెళ్లడం గమనార్హం. కిశోర్‌కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డిని కలుసుకునేందుకు చంద్రబాబు అదే ఇంటికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ఇంటికి వెళ్లడం గమనార్హం. కాగా, గ్రామానికి వచ్చిన చంద్రబాబుకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.