ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్... టాస్ గెలిచిన టీమిండియా
- సౌతాంప్టన్ లో మ్యాచ్
- బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- అరంగేట్రం చేస్తున్న అర్షదీప్ సింగ్
- కరోనా నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రీషెడ్యూల్డ్ టెస్టులో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకుని జట్టులోకి రావడం టీమిండియాలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ మ్యాచ్ ద్వారా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవల ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో ఆడిన ఉమ్రాన్ మాలిక్ కు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు.
టీమిండియా..
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చహల్.
ఇంగ్లండ్ జట్టు...
జోస్ బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టన్, హ్యారీ బ్రూక్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టాప్లే, మాథ్యూ పార్కిన్సన్.