'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ వస్తోంది!
- కిరణ్ అబ్బవరం నుంచి మరో సినిమా
- విభిన్నమైన కథాంశంతో సాగే సినిమా
- దర్శకుడిగా శ్రీధర్ పరిచయం
- ఈ నెల 10వ తేదీన టీజర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం హీరోగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథానాయికగా సంజనా ఆనంద్ పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ తేదీని .. సమయాన్ని ప్రకటించారు.
ఈ నెల 10వ తేదీన ఉదయం 11:05 నిమిషాలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. వరుసగా రెండు ఫ్లాపులు చూసిన కిరణ్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.
ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ 2 లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మురళీ కిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది.