వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 427 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 143 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఐదున్నర శాతానికి పైగా పెరిగిన టైటాన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు దిగిరావడంతో పాటు, అంతర్జాతీయ సానుకూలతలు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 54,178కి పెరిగింది. నిఫ్టీ 143 పాయింట్లు పుంజుకుని 16,132 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (5.69%), టాటా స్టీల్ (4.88%), ఎల్ అండ్ టీ (3.52%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.57%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-1.26%), నెస్లే ఇండియా (-1.14%), భారతి ఎయిర్ టెల్ (-1.05%), రిలయన్స్ (-1.01%), బజాజ్ ఫైనాన్స్ (-0.98%).