దుల్హ‌న్ ప‌థ‌కం ఆప‌డానికి కార‌ణాలేమిటో చెప్పండి.. ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

  • పేద మైనారిటీల వివాహానికి ఆర్థిక సాయం అందించే ప‌థ‌క‌మే దుల్హ‌న్‌
  • 2015లో అప్ప‌టి టీడీపీ హ‌యాంలో ఈ ప‌థ‌కం ప్రారంభం
  • తాజాగా ప‌థకాన్ని నిలిపివేస్తూ ప్ర‌భుత్వ నిర్ణయం
  • హైకోర్టును ఆశ్ర‌యించిన‌ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి 
నిరుపేద మైనారిటీల వివాహాలకు ప్రభుత్వం తరఫున రూ.50 వేలు అందజేస్తున్న దుల్హన్ పథకంపై ఏపీ హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. 2015లో అప్ప‌టి టీడీపీ ప్రభుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ ప‌థ‌కాన్ని నిలిపివేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షిబ్లి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ఓ ద‌ఫా విచార‌ణ జ‌ర‌గ‌గా... గురువారం మ‌రో విడ‌త విచార‌ణ జ‌రిగింది. ఈ విచార‌ణ‌లో భాగంగా దుల్హ‌న్ ప‌థ‌కాన్ని ఆపేశామ‌ని చెప్పారు క‌దా... అందుకు గ‌ల కార‌ణాలేమిటో చెప్పాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వ న్యాయ‌వాదిని కోరింది. ఈ వివ‌ర‌ణ అంద‌జేసేందుకు త‌మ‌కు 4 వారాల గ‌డువు కావాల‌న్న ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించిన కోర్టు... విచార‌ణ‌ను 4 వారాల‌కు వాయిదా వేసింది.


More Telugu News