పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పెళ్లి ఈరోజే... కాబోయే భార్య గుర్ ప్రీత్ కౌర్ గురించి కొన్ని విశేషాలు!
- 32 ఏళ్ల కౌర్ ను పెళ్లాడుతున్న భగవంత్ మాన్
- రెండు కుటుంబాలకు ఎన్నో ఏళ్లుగా పరిచయం
- ఎన్నికల సమయంలో మాన్ కు ఎంతో సహకరించిన కౌర్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈరోజు రెండో వివాహం చేసుకోబోతున్నారు. 48 ఏళ్ల మాన్ డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను పెళ్లాడుతున్నారు. ఆరేళ్ల క్రితం తన తొలి భార్యతో మాన్ విడాకులు తీసుకున్నారు. మాన్, గుర్ ప్రీత్ కౌర్ ల పెళ్లి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాన్ పెళ్లాడబోతున్న డాక్టరమ్మ కౌర్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
గుర్ ప్రీత్ కౌర్ వయసు 32 ఏళ్లు. భగవంత్ మాన్ కంటే 16 ఏళ్లు చిన్నవారు. కురుక్షేత్ర జిల్లా పెహోవాకు చెందిన కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి ఇందర్ జిత్ సింగ్ ఒక రైతు. ఆమె తల్లి మాతా రాజ్ కౌర్ సాధారణ గృహిణి. కౌర్ కు ఇద్దరు సోదరిలు ఉన్నారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటున్నారు. మాన్, కౌర్ కుటుంబాలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది.
చిన్నప్పటి నుంచి కూడా గుర్ ప్రీత్ కౌర్ మెరుగైన విద్యార్థిగా ఉన్నారు. చాలా తెలివైన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. హర్యానాలోని మరకందేశ్వర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. అంతేకాదు, ఆమె మెడిసిన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భగవంత్ మాన్ కు కౌర్ ఎంతో సహకరించారు. ఆయనతో కలిసి ప్రచారం నిర్వహించారు.