ఐశ్వర్య రాజేశ్ ‘డ్రైవర్ జమున’ ట్రైలర్ విడుదల
- పి. క్లిన్ సిన్ దర్శకత్వంలో ‘డ్రైవర్ జమున’
- క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఐశ్వర్య రాజేశ్
- నాలుగు భాషల్లో విడుదల కానున్న సినిమా
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంటోంది యువ నటి ఐశ్వర్య రాజేశ్. హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ‘డ్రైవర్ జమున’ అనే చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పి. క్లిన్ సిన్ దర్శకత్వం వహించారు.
ఐశ్వర్య క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపించే ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజైంది. నిర్మాత సురేశ్ బాబు విడుదల చేసిన ట్రైలర్ ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. ఇంట్లో పెద్దవాళ్ల మాట కాదని జమున (ఐశ్వర్య రాజేశ్) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక రౌడీ మూక ఒక రాజకీయ నేతను హత్య చేయడానికి పథకం వేస్తుంది. వాళ్లు జమున క్యాబ్ ఎక్కి 90 నిమిషాల పాటు ప్రయాణిస్తారు. నక్కపల్లి టు రుషికొండ వెళ్లే మార్గంలో ఎలాంటి ఘటనలు జరిగాయనే స్టోరీతో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
ఈ రైడ్‌లో జరిగే ట్విస్టులు, కీలక మలుపులు కొనసాగనున్నాయనేది సస్పెన్స్ లో పెట్టాడు దర్శకుడు. ట్రైలర్ మొత్తం చాలా థ్రిల్లింగ్ గా ఉండేలా కట్ చేశారు. ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 18 రీల్స్ బ్యానర్ పై ఎస్పీ చౌదరి దీనిని నిర్మించారు.