ఉదయ్‌పూర్ దర్జీ హత్య కేసు.. కన్నయ్యలాల్ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు
- నుపుర్ శర్మకు మద్దతు పలికి హత్యకు గురైన కన్నయ్యలాల్
- ఆయన కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం
- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సీఎం అశోక్ గెహ్లాట్
దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన ఉదయ్‌పూర్ దర్జీ కన్నయ్యలాల్ తేలి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతు పలికిన కన్నయ్యలాల్ జూన్ 28న హత్యకు గురయ్యారు.
కన్నయ్యలాల్ కుమారులైన యష్ తేలి, తరుణ్ తేలిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు సీఎం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారి అపాయింట్‌మెంట్ కోసం నిబంధనల్లో సడలింపు లభించినట్టు చెప్పారు. రాజస్థాన్ సబార్డినేట్ ఆఫీస్ క్లర్క్ సర్వీస్ (సవరణ) రూల్స్ 2008, 2009లోని రూల్ 6సి ప్రకారం ఈ నియామకాలు జరుపుతున్నట్టు చెప్పారు. వారి కుటుంబం మొత్తం కన్నయ్యలాల్ సంపాదన పైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.