నేడు ఇంగ్లండ్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్
- రాత్రి 10.30 నుంచి మ్యాచ్
- టీ20 తుది జట్టు కూర్పుపై దృష్టిపెట్టిన టీమిండియా
- ఇంగ్లండ్ జట్లు లక్ష్యం కూడా అదే
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సవాల్‌కు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో భారత్ పోటీ పడనుంది. ఈ సిరీస్‌లో విజయంతో పాటు మరో అంశంపై భారత్ ఫోకస్ పెట్టింది. ఈ సిరీస్ ద్వారా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం తుది జట్టును ఎంపిక చేసుకోవాలని భావిస్తోంది. కొవిడ్‌తో ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగుతున్నాడు.
అయితే టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన సీనియర్లు విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఈ పోరుకు దూరంగా ఉన్నారు. వీళ్లంతా రెండో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వస్తారు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో పలువురు యువ ఆటగాళ్లకు మరో అవకాశం దక్కనుంది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కీపర్ సంజూ శాంసన్ కు అవకాశం లభిస్తే వాళ్లు కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.
ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీతో ఆకట్టుకున్న దీపక్ హుడాపై అందరి ఫోకస్ ఉంది. అతను బాగా ఆడుతున్న నేపథ్యంలో మిడిలార్డర్ లో సూర్యకుమార్‌కు పోటీగా మారాడు. కాబట్టి ఈ సిరీస్ లో సూర్యకుమార్ తన బ్యాట్ పవర్ చూపెడితేనే ప్రపంచ కప్ టీమ్‌లో చోటు నిలబెట్టుకుంటాడు. ఐపీఎల్‌లో సత్తా చాటిన రాహుల్ త్రిపాఠి, అర్షదీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో అరంగేట్రం అవకాశం వస్తుందేమో చూడాలి. సీనియర్ పేసర్ భువనేశ్వర్, స్పిన్నర్ చహల్ కూడా ఈ సిరీస్‌లో రాణించి ప్రపంచ కప్ జట్టులో చోటు సాధించాలని చూస్తున్నారు.
మరోవైపు ఇయాన్ మోర్గాన్ స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న జోస్ బట్లర్‌కు ఈ సిరీస్ తొలి సవాల్‌గా మారింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, బెయిర్‌స్టోకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటికీ ఇంగ్లండ్ బలంగానే కనిపిస్తోంది. బట్లర్, లివింగ్‌స్టోన్ భీకర ఫామ్‌లో ఉన్నారు కాబట్టి భారత్‌కు సవాల్ తప్పదు.