మదనపల్లె మినీ మహానాడుకు పోటెత్తిన జనం... వర్షంలోనే వేదిక చేరుకున్న చంద్రబాబు
- మదనపల్లెలో ప్రారంభమైన మినీ మహానాడు
- ఇంత భారీ జన సందోహాన్ని ముందెన్నడూ చూడలేదన్న అమర్నాథ్ రెడ్డి
- బెంగళూరు మీదుగా మదనపల్లి చేరుకున్న చంద్రబాబు
ఏపీలో విపక్షం తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడుల్లో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లె మినీ మహానాడుకు భారీ జన సందోహం హాజరైందని... ఈ స్థాయిలో టీడీపీ సభలకు హాజరైన జనాన్ని 1983 నుంచి తాను చూడనే లేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు.
ఇదిలా ఉంటే... ఈ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా మదనపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ-కర్ణాటక సరిహద్దు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాసేపట్లో మహానాడు ప్రారంభమవుతుందనగా... అక్కడ భారీ వర్షం కురిసింది. వర్షంలోనే సభకు హాజరైన జనం నిలబడగా...వర్షంలో తడుస్తూనే చంద్రబాబు వేదిక మీదకు చేరుకున్నారు.