స్విగ్గీలో ఆర్డర్​ పై తండ్రీకొడుకుల వాట్సప్​ సంభాషణ వైరల్​.. తండ్రి సెటైర్​కు అంతా షాక్​!

  • స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన జితు అనే వ్యక్తి
  • అడ్రస్ తప్పుగా ఇవ్వడంతో.. రిఫండ్
  • నిన్ను కూడా పొరపాటున ఆర్డర్ చేశామంటూ తండ్రి సెటైర్ 
స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ విషయంలో ఓ తండ్రి, కొడుకు మధ్య వాట్సప్ సంభాషణ ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. కొడుకు చేసిన పొరపాటుకు తండ్రి ఇచ్చిన రిప్లై చూసి అంతా అవాక్కయ్యారు. ట్విట్టర్ యూజర్ జితు అనే వ్యక్తి తన తండ్రితో వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేశాడు. 

ఆ పోస్ట్‌కి ‘రోస్ట్ చేసిన చికెన్ తినాలనుకున్నాను, కానీ నేనే  రోస్ట్ అయిపోయాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంభాషణ చూసి  ట్విట్టర్‌ యూజర్లు నవ్వుకుంటున్నారు. ఈ ట్వీట్ దాదాపు నాలుగు వేల లైక్‌లు, 443 రీట్వీట్‌లతో వైరల్ అయింది. 

జితు అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. కానీ ఆర్డర్ లో తన అడ్రస్ తప్పుగా ఎంటర్ చేశాడు. దాంతో, ఈ సమస్యను తను డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన స్విగ్గీ డబ్బు రిఫండ్‌ చేసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. 

‘తప్పుడు అడ్రస్ కు ఆర్డర్ చేసిన దానికి సంబంధించి స్విగ్గీ నుంచి రిఫండ్ (డబ్బులు వాపసు) వచ్చింది’ అని తల్లిదండ్రుల వాట్సప్ గ్రూప్ లో మెసేజ్ చేశాడు. దీనికి ఆ తండ్రి నుంచి అనూహ్యమైన రీప్లై వచ్చింది. ‘నిన్ను కూడా పొరపాటున ఆర్డర్ చేశాం. కానీ, నాకు ఇంకా రిఫండ్ రాలేదు’ అని సెటైర్ వేశాడు. ఈ సంభాషణ స్ర్కీన్ షాట్ ను జితు ట్విట్టర్లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. తండ్రి రిప్లై చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. 


More Telugu News