మీరు 'ఎన్ఆర్ఐ'నా? అన్న ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని జవాబు
- ఈ నెల 4న మన్ హట్టన్ చిత్రాలను పోస్ట్ చేసిన పారిశ్రామికవేత్త
- అదే రోజు అమెరికాలో స్వాతంత్య్ర దిన వేడుకలు
- దీంతో మీరు ఎన్ఆర్ఐనా? అంటూ ఓ నెటిజన్ సందేహం
- హచ్ఆర్ఐ అంటూ భిన్నంగా బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సందర్భం వస్తే చాలు.. తన విలక్షణత చాటుకుంటారు. అటువంటి సందర్భమే ఆయనకు మరోసారి ఎదురైంది. ఆయన మన్ హట్టన్ గురించి చేసిన పోస్ట్ ల గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా స్పందిస్తూ.. చిత్రమైన బదులిచ్చారు.
‘‘మన్ హట్టన్ జూలై 4, 2022 స్కైలైన్ ఎరప్ట్స్’’ అంటూ ఆయన కొన్ని ఫొటోలు, వీడియోను ట్విట్టర్ లో ఈ నెల 4న పోస్ట్ చేశారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంది. ఆ దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ఆకాశం బద్దలైందన్న అర్థంతో ఆయన క్యాప్షన్ పెట్టారు. అంతేకాదు, మరో ఫొటోను విడిగా మరో ట్వీట్ లో పోస్ట్ చేశారు. అందులో మనుషులు తయారు చేసిన ఏ లైట్ అయినా చంద్రుడికి సాటిరాదన్న అభిప్రాయాన్ని ఆనంద్ మహీంద్రా వ్యక్తం చేశారు.
ఇవి చూసిన ఓ నెటిజన్ మీరు ఎన్ఆర్ఐనా? అని సందేహం వ్యక్తం చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘న్యూయార్క్ లో కుటుంబాన్ని చూసేందుకు వచ్చాను. కనుక నేను హెచ్ఆర్ఐ. హార్ట్ (ఎప్పుడూ) రెసిడెంట్ ఇండియా’’ అని బదులిచ్చారు. తన హృదయంలో ఎప్పుడూ భారతే ఉంటుందన్నారు.