చరణ్ కోసం రంగంలోకి 1200 మంది ఫైటర్లు!
- దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న శంకర్ సినిమా
- కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా
- హైదరాబాదులో యాక్షన్ చిత్రీకరణకు ఏర్పాట్లు
- పాట షూటింగును పంజాబ్ లో ప్లాన్ చేసిన టీమ్
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
చరణ్ ఇప్పుడు శంకర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, ప్రతి అంశం ప్రత్యేకం అన్నట్టుగా శంకర్ తీర్చిదిద్దుతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉండనున్నాయి. ఇంతవరకూ చరణ్ తన కెరియర్లో చేయని రిస్కీ ఫైట్స్ ఈ సినిమా కోసం చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేయించారట. దాని ప్రకారం ఈ యాక్షన్ ఎపిసోడ్ లో చరణ్ 1200 మంది ఫైటర్లతో తలపడనున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ ను హైదరాబాదులో 20 రోజుల పాటు చిత్రీకరించనున్నట్టుగా సమాచారం. తెరపై ఈ యాక్షన్ సీన్ 15 నిమిషాల నిడివిలో కనిపిస్తుందట.
ఇక అలాగే త్వరలో చరణ్ - కియారా కాంబినేషన్లో ఓక్ పాటను 'పంజాబ్' లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. గణేశ్ మాస్టర్ కొరియో గ్రఫీని అందిస్తున్న ఈ పాటలో 1000 మంది డాన్సర్లు పాల్గొంటున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఫైటు .. పాటను చిత్రీకరిస్తే 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్టేనని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.