మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 16,159 కరోనా కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 28 మంది మృతి
- 1,15,212కి పెరిగిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 4.54 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 16,159 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 15,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 28 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212కి పెరిగింది. ముందు రోజుతో పోల్చితే యాక్టివ్ కేసులు 0.26 శాతం పెరిగాయి. మరో కీలక విషయం ఏమిటంటే మహారాష్ట్ర, కేరళలో మహమ్మారి అదుపులో ఉండగా... పశ్చిమబెంగాల్, తమిళనాడులో కేసులు పెరుగుతున్నాయి.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,35,47,809కి పెరిగింది. వీరిలో 4,29,07,327 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,270 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.53 శాతంగా, పాజిటివిటీ రేటు 3.56 శాతంగా, మరణాలు రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 198.20 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.