భావ ప్రకటనా స్వేచ్ఛ హిందూ దేవతల విషయంలోనేనా?: శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
- అందరికీ సమాన గౌరవం ఉండాలన్న శివసేన ఎంపీ
- కించపరిచే సాధనం కాకూడదన్న అభిప్రాయం
- కాళి సినిమా పోస్టర్ బాధకు గురిచేసినట్టు ప్రకటన
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కాళికామాత వివాదాస్పద పోస్టర్ ను తప్పుబట్టారు. జగన్మాతను సిగరెట్ తాగుతున్నట్టు చూపిస్తున్న కాళి సినిమా పోస్టర్ ను నిర్మాత, దర్శకురాలు, కెనడాలో ఉంటున్న లీనా మణిమేకలై విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ మాట్లాడే స్వేచ్ఛ అన్నది కేవలం హిందూ దేవతలకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు. ఆమె ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
‘‘హిందూ దేవుళ్లు, దేవతల విషయంలోనే భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితం చేయలేదు. మిగిలిన వారు మతపరమైన సున్నిత అంశాలను చర్చించరు. 'కాళి' సినిమా పోస్టర్ ను చూసి నేను బాధపడ్డాను. అందరికీ సమాన గౌరవం ఉండాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నది కించపరిచే సాధనం కాకూడదు’’ అని ఆమె తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. కాళికామాతను అగౌరవంగా చూపించడం పట్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే కేసులు నమోదు కావడం తెలిసిందే.