తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ
- ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో చురుగ్గా రుతుపవనాలు
- నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
- సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మొన్న ఝార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం నిన్న మధ్యప్రదేశ్‌పైకి విస్తరించినట్టు అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, బంగాళాఖాతంపై 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.