బీజేపీలోకి తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి.. బండి సంజయ్‌తో భేటీ
- గతంలో టీజేఎస్‌లో పనిచేసిన రచనా రెడ్డి
- సంజయ్‌తో భేటీలో తాజా రాజకీయాల పరిణామాలపై చర్చ!
- త్వరలోనే ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం
తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి నిన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు, వీరిద్దరి కలయిక రాజకీయ ప్రాధాన్యం కూడా సంతరించుకుంది. త్వరలోనే ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రచనా రెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించారు. ఆమె వేసిన కేసుల గురించి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. కాగా, రచనారెడ్డి గతంలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) లో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీ చీఫ్ కోదండరాం తీరును తప్పుబడుతూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.