రుషికొండ తవ్వకాలపై టీడీపీ, జనసేన పిటిషన్లు... ఏపీ సర్కారుకు హైకోర్టు నోటీసులు
- రుషికొండలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషన్
- టీడీపీ, జనసేన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు
- పిటిషన్‌పై కౌంటర్ల దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విశాఖ పరిధిలోని రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు సాగుతున్నాయంటూ మంగళవారం ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. వీటిని విచారణకు స్వీకరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అంతేకాకుండా ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రుషికొండలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీతో పాటు జనసేన కూడా చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తోంది. అంతేకాకుండా అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు కూడా టీడీపీ నేతలు యత్నించారు. అయితే అందుకు ప్రభుత్వం సమ్మతించలేదు. దీంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించినట్లుగా సమాచారం. అదే సమయంలో టీడీపీతో పాటు జనసేన కూడా ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.