లుహాన్స్క్ లో విజయాన్ని అధికారికంగా ప్రకటించిన పుతిన్

  • ఉక్రెయిన్ లో ఒక్కొక్క ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న రష్యా
  • ఇప్పటికే డాన్ బాస్, డొనెట్స్క్ కైవసం
  • తాజాగా లుహాన్స్క్ లోనూ ముగిసిన ఉక్రెయిన్ పోరు
  • పుతిన్ కు వివరించిన రష్యా రక్షణ మంత్రి షొయిగు
ఉక్రెయిన్ లోని వ్యూహాత్మక భాగాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా తాజాగా లుహాన్స్క్ పైనా పట్టు సాధించింది. లుహాన్స్క్ లో తమ సేనలు విజయం సాధించాయంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు. లుహాన్స్క్ లో తమ బలగాలకు ఎదురైన ఆఖరి ప్రతిఘటనను కూడా అణచివేశామని, అక్కడి నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనుదిరిగాయని పుతిన్ కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు వివరించారు. 

కాగా, తాజా పరిణామంతో ఉక్రెయిన్ పారిశ్రామిక ప్రాంతం డాన్ బాస్, డొనెట్స్క్ లతో పాటు లుహాన్స్క్ కూడా రష్యా వశమైంది. రష్యా సేనలు ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై తీవ్రస్థాయిలో దాడులు జరిపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీవ్ రష్యా పరమైతే యుద్ధం ముగిసినట్టేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


More Telugu News