భారీ లాభాల్లోకి వెళ్లి.. చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

  • ఒకానొక సమయంలో 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
  • చివరకు 100 పాయింట్ల నష్టంతో ముగిసిన వైనం
  • 24 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఒకానొక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. అయితే, ఆర్థికమాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 53,134కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 15,810కి జారుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.92%), సన్ ఫార్మా (0.90%), రిలయన్స్ (0.80%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.73%), విప్రో (-1.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.20%), ఎల్ అండ్ టీ (-1.12%), మారుతి (-1.10%).


More Telugu News