పెగాసస్‌పై భూమన కమిటీ విచారణ ప్రారంభం.. ఐటీ, హోం శాఖ, ఆర్టీజీఎస్ అధికారుల హాజరు
- టీడీపీ సర్కారుపై పెగాసస్ ఆరోపణలు
- విపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్ కొన్నారని ఆరోపణలు
- అసెంబ్లీ కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
- భూమన నేతృత్వంలో విచారణ ప్రారంభించిన కమిటీ
పెగాసస్ నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్లుగా టీడీపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సభా సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ మంగళవారం తన విచారణను ప్రారంభించింది. ఇప్పటికే ఓ దఫా సమావేశమైన ఈ కమిటీ... తమకు అప్పగించిన వ్యవహారంపై సమగ్రంగా చర్చించింది. జులై 5న విచారణ ప్రారంభించనున్నట్లు కూడా కమిటీ నాడే ప్రకటించింది.
తాజాగా మంగళవారం అమరావతి పరిధిలోని అసెంబ్లీలో భూమన నేతృత్వంలోని కమిటీ పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాష్ట్ర హోం శాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆర్టీజీఎస్‌కు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. పెగాసస్ సంస్థకు చెందిన బృందం నాటి టీడీపీ ప్రభుత్వాన్ని సంప్రదించిందా? ఆ భేటీలో ఎవరేమన్నారు? ఒప్పందం కుదిరిందా? కుదిరి ఉంటే దానికి సంబంధించిన పత్రాలు.. లేదంటే ఒప్పందం కుదరకపోవడానికి గల కారణాలేమిటి? అన్న విషయాలపై ఈ కమిటీ అధికారలను ప్రశ్నించనుంది.