అమర్ నాథ్ గుహలో శివలింగాన్ని గుర్తించిందే ముస్లిం: ఫరూక్ అబ్దుల్లా

  • ఏ ముస్లిం ఏ రోజూ మరో మతాన్ని వేలెత్తి చూపలేదని వ్యాఖ్య
  • 1990ల్లోనే ఈ ధోరణి కొన్ని చోట్ల కనిపించిందన్న అబ్దుల్లా
  • ప్రతికూల వాతావరణంతో నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర
అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని గుర్తించిందే ముస్లిం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఏ ముస్లిం కూడా ఇంతవరకు మరే మతం పట్ల వేలెత్తి చూపలేదన్నారు. కాకపోతే 1990ల్లోనే ఆ ధోరణి కనిపించినట్టు అంగీకరించారు.

‘‘పహల్గామ్ కు చెందిన ముస్లిం వ్యక్తి అమర్ నాథ్ గుహలో శివలింగాన్ని చూసి, ఆ విషయాన్ని కశ్మీరీ పండిట్లకు చెప్పాడు. ఏ ముస్లిం కూడా ఎప్పుడూ ఏ మతాన్ని వేలెత్తి చూపలేదు. ఇది నిజం. కాకపోతే 1990ల్లో కొన్ని చోట్ల ఈ ధోరణి కనిపించింది’’ అని మీడియాతో ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. 

మరోవైపు వర్షాల కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమీక్షించిన అధికార యంత్రాంగం అమర్ నాథ్ యాత్రను మంగళవారం నుంచి నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి యాత్రకు భక్తులను అనుమతించడం లేదని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,000కు పైగా భక్తులు అమర్ నాథ్ ను దర్శించుకున్నారు.


More Telugu News