ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక... నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం
- జులై 19 వరకు నామినేషన్ల స్వీకరణ
- జులై 20న నామినేషన్ల పరిశీలన
- జులై 22 వరకు ఉపసంహరణలకు అవకాశం
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, ఆ తర్వాత నెలలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు చేపట్టనున్నారు. అందుకోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. జులై 19తో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. జులై 20న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 తుదిగడువు. ఓట్ల లెక్కింపు కూడా ఆగస్టు 6వ తేదీ నాడే చేపట్టనున్నారు.