తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ సాగర్ నియామకం
- తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజీవ్
- కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వైనం
- కేసీఆర్, కవితలకు కృతజ్ఞతలు తెలిపిన రాజీవ్
తెలంగాణలో ఇప్పటికే పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా పలువురిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా మరో కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజీవ్ సాగర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించిన పార్టీ అధిష్ఠానానికి సోమవారం ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను సోమవారం కలిసిన రాజీవ్ సాగర్... ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. రాజీవ్ సాగర్ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతికి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకం ఉంచి ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, పార్టీలో తన ఎదుగుదలకు తోడ్పాటు అందించిన కవితకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.