మహారాష్ట్ర కొత్త సీఎం షిండే కీలక నిర్ణయం... ఇంధనంపై వ్యాట్‌ను తగ్గిస్తామని ప్రకటన
- ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్ షిండే
- త్వరలోనే వ్యాట్ తగ్గిస్తామంటూ షిండే ప్రకటన
- ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు ఉపశమనమని వెల్లడి
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తర్వాత ఆ రాష్ట్రానికి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్ షిండే సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
వాస్తవానికి ఇంధనంపై అటు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండగా, రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి. ఇటీవల పలు కారణాలతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేశాయి. ఈ క్రమంలో తాము కొంత మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని చెప్పిన కేంద్రం... రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ దిశగా షిండే కీలక ప్రకటన చేయడం గమనార్హం.