మీరు నిప్పుతో చెలగాటమాడలేరు... నుపుర్ శర్మను అరెస్ట్ చేయండి: మమతా బెనర్జీ డిమాండ్
- మహ్మద్ ప్రవక్తపై నుపుర్ తీవ్ర వ్యాఖ్యలు
- దేశీయ, అంతర్జాతీయంగా దుమారం
- 'ఈ వివాదం మొత్తం ఓ కుట్ర' అన్న మమత
- అన్ని వర్గాల వారి కోసం పాటుపడతామని వెల్లడి
కోల్ కతాలో ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. నుపుర్ శర్మను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని మమతా డిమాండ్ చేశారు. "నుపుర్ ను అరెస్ట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి... మీరు నిప్పుతో చెలగాటమాడలేరు" అంటూ బీజేపీని హెచ్చరించారు.
ఈ వివాదం మొత్తం ఓ కుట్ర అని అన్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీనే ఈ కుట్రకు పాల్పడిందని ఆమె ఆరోపించారు. విభజన, విద్వేషపూరిత రాజకీయాల పట్ల తమకు నమ్మకంలేదని, తాము హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధమతస్తులు, అన్ని వర్గాల వారి కోసం పాటుపడతామని మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.
ఓ టీవీ చానల్ లో మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి నుపుర్ శర్మ ఆచూకీ లేకుండాపోయారు. ఆమెపై కోల్ కతాలోనూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇటీవల కోల్ కతా పోలీసులు నుపుర్ కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.