భీమవరంలో ఓ వృద్ధురాలికి పాదాభివందనం చేసిన ప్రధాని మోదీ... ఆమె ఎవరంటే...!
- పశ్చిమ గోదావరి జిల్లా విచ్చేసిన ప్రధాని మోదీ
- భీమవరంలో అల్లూరి జయంతి ఉత్సవాలకు హాజరు
- స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులతో భేటీ
- పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల కుమార్తెను పరామర్శించిన వైనం
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చిన సంగతి తెలిసిందే. భీమవరంలో మన్యం విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది.
మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరమోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి కుమార్తె పసల కృష్ణభారతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 90 ఏళ్ల కృష్ణభారతి వీల్ చెయిర్ లో ఉండగా, మోదీ ఆమెకు పాదాభివందనం చేశారు. ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణభారతి సోదరిని, మేనకోడలిని కూడా కలుసుకున్నారు.
.