ప్రధాని మోదీకి వినతి పత్రంతో వీడ్కోలు పలికిన ఏపీ సీఎం జగన్
- మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటన
- సోమవారం గన్నవరం నుంచి ఢిల్లీకి పయనం
- మోదీకి వీడ్కోలు పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర తెలుగు రాష్ట్రాల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం శని, ఆదివారాలు హైదరాబాద్‌లో గడిపిన మోదీ... సోమవారం ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం భీమవరం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మోదీకి జ్ఞాపికను అందించి గవర్నర్ వీడ్కోలు పలకగా... సీఎం జగన్ మాత్రం ఓ వినతి పత్రం ఇచ్చి మోదీకి వీడ్కోలు పలికారు. వీడ్కోలు సందర్భంగా జగన్ వినతి పత్రం ఇవ్వడంతో దానిని స్వీకరించిన మోదీ... జగన్‌తో సరదాగా మాట్లాడారు.