జగన్‌ను చేయి పట్టి ముందుకు పిలిచి... చిరు భుజం తట్టి ఉద్వేగంతో మాట్లాడిన మోదీ... వీడియో ఇదిగో
- భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి
- చిరును ఆత్మీయంగా పలకరించిన ప్రధాని
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ఆయన విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రులు రోజా, దాడిశెట్టి రాజాలతో పాటు టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేదిక మీదకు వచ్చిన మోదీ ప్రజలకు అభివాదం చేసేందుకు వేదిక ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పక్కనే నిలబడి ముందుకొచ్చే దిశగా సంశయిస్తున్నట్లుగా కనిపించిన జగన్‌ను మోదీ చేయి పట్టి మరీ ముందుకు పిలిచారు.
అనంతరం తనను సత్కరించేందుకు వచ్చిన చిరంజీవితో మోదీ కాస్తంత ఉద్వేగంగా వ్యవహరించారు. చిరు భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తున్నట్లుగా మాట్లాడిన మోదీ.. ఓ నిమిషం పాటు చిరుతో ఏదో మాట్లాడారు. మోదీ చెప్పిన మాటలను విన్న చిరు ఉద్వేగంతో మోదీకి నమస్కరించారు. చిరుతో మాట్లాడుతున్నంత సేపు మోదీ ఆయన చేతులను విడిచిపెట్టనే లేని దృశ్యం ఆసక్తి రేకెత్తించింది.