కరోనా నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. నెట్స్ లో కఠోర సాధన!

  • ఇటీవల కరోనా బారిన పడిన రోహిత్ శర్మ
  • తాజా టెస్టుల్లో నెగెటివ్ అని తేలిన వైనం
  • వైట్ బాల్ మ్యాచ్ లకు సిద్ధమవుతున్నాడన్న బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దీంతో, ప్రాక్టీస్ కోసం రోహిత్ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. కఠోర సాధన చేస్తున్న రోహిత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ షాట్లతో పాటు, డిఫెన్సివ్ షాట్లను రోహిత్ ప్రాక్టిస్ చేశాడు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న రోహిత్ శర్మ నెట్స్ లో ఉన్నాడని బీసీసీఐ చెప్పింది. వైట్ బాల్ క్రికెట్ కోసం సిద్ధమవుతున్నాడని తెలిపింది. 

లీసెష్టర్ షైర్ తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ బ్యాటింగ్ కు దిగలేదు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకోవడంతో ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్ తో జరిగే తొలి టీ20కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలను టీమిండియా ఆడబోతోంది.


More Telugu News