మేయర్ అబ్బాయి.. మొసలి అమ్మాయి.. మెక్సికోలో చిత్రమైన పెళ్లి!
- స్థానిక సంప్రదాయం మేరకు మొసలిని పెళ్లి చేసుకున్నమేయర్
- గ్రామ పెద్ద ఇలా చేస్తే వానలు బాగా కురుస్తాయనే నమ్మకం
- మొసలిని అందంగా అలంకరించిన గ్రామస్థులు
- దానిని ముద్దు పెట్టుకుంటూ ఫొటోలకు పోజులిచ్చిన మేయర్
మన దగ్గర వానలు పడాలని కోరుకుంటూ కప్పల పెళ్లిళ్లు చేస్తుంటారు. కొన్నిచోట్ల అయితే వరద పాశమని, మరికొన్ని చోట్ల ఇంకో రకంగా సంప్రదాయాలను పాటిస్తుంటారు. గుళ్లలో పూజలు చేస్తుంటారు. కానీ మెక్సికోలో మాత్రం మొసలిని మనుషులు పెళ్లి చేసుకుంటారు. అది ఇప్పటి అప్పటి సంప్రదాయం కాదు.. వందల ఏళ్లనాటి ఆచారం. దాన్ని పాటిస్తూనే మెక్సికోలోని ఓ నగర మేయర్ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. దానిని ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలకు పోజులూ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్ నెట్ లో తెగ సందడి చేస్తోంది కూడా.
గ్రామ పెద్ద మొసలిని పెళ్లాడాలి..
మెక్సికోలో కొంతకాలంగా వానలు సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనితో అక్కడి సాన్ పెడ్రో హామెలుల గ్రామస్థులు తమ పాత సంప్రదాయాన్ని అమల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి ఆచారం ప్రకారం.. గ్రామ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే.. వానలు బాగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయని, చేపలు సమృద్ధిగా దొరుకుతాయని నమ్ముతారు. ఇదే క్రమంలో ఈసారి ఆ ఆచారాన్ని అమల్లో పెట్టారు. పట్టణ మేయర్ విక్టర్ హ్యూగో సోసాకు మొసలితో పెళ్లికి సిద్ధం చేశారు. పెళ్లి కుమారుడు హ్యోగోను, పెళ్లి కుమార్తె మొసలిని.. ప్రత్యేక దుస్తుల్లో అందంగా తయారు చేశారు. మొసలికి ప్రత్యేకంగా తెల్లని ముసుగు కప్పారు.
మేళతాళాల మధ్య వేడుకగా..
మొసలితో పెళ్లి అంటే ఏదో మామూలుగా చేసి వదిలేయలేదు. ఊరంతా సందడి చేశారు. సంప్రదాయ వాయిద్యాలు, మేళతాళాల మధ్య నృత్యాలు చేస్తూ.. పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తె మొసలిని పట్టణంలో ఊరేగించారు. తర్వాత వివాహ వేడుక జరిపించారు. ఈ సందర్భంగా తమ పట్టణంలో విస్తారంగా వానలు పడాలని, అంతా మంచే జరగాలని ప్రార్థించారు.

- వేడుక జరుగుతున్నంత సేపు మేయర్ హ్యూగో పెళ్లి కుమార్తె మొసలిని ఎత్తుకునే ఉన్నాడు. మధ్య మధ్యలో ముద్దులు పెడుతూ వచ్చారు.
- ఎంత పెళ్లి కుమార్తె అయినా అది మొసలి కదా.. అందుకే ముందు జాగ్రత్తగా దాని మూతిని కట్టేసి ఉంచడం గమనార్హం.