వీర భూమి, పుణ్య భూమి ఆంధ్రకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: మోదీ
- తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అన్న ప్రధాని
- అల్లూరికి చెందిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి
- ఏడాది పాటు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్న మోదీ
స్వాతంత్ర్య సాధనలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అందరికీ తెలవాలని... అందుకే మనం ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ చెప్పారు. దేశం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్య భూమి, ఒక వీర భూమి అని చెప్పారు. ఇలాంటి పుణ్య భూమికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. పింగళి వెంకయ్య, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహోన్నతులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడం గమనార్హం.
అల్లూరి రంప పోరాటానికి వందేళ్లు పూర్తయ్యాయని మోదీ చెప్పారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం సంతోషకరమని అన్నారు. వందేమాతరం నినాదం, 'మనదే రాజ్యం' నినాదం ఒకే లాంటివని చెప్పారు. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అల్లూరికి చెందిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మోగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్ ను అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియంను నిర్మిస్తామని అన్నారు. మన్యం వీరుడిగా అల్లూరి ఆంగ్లేయులతో వీరోచిత పోరాటం చేశారని చెప్పారు. మనమంతా ఒక్కటే అనే భావనతో ఉద్యమం జరిగిందని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలని చెప్పారు. ఏడాది పాటు అల్లూరి జయంతి, రంప పోరాటం ఉత్సవాలను నిర్వహిస్తామని మోదీ తెలిపారు.