భుజం విరగడంతో ఆసుపత్రిలో చేరిన లాలూ ప్రసాద్​ యాదవ్

  • పాట్నాలోని ఇంట్లో మెట్లపై నుంచి జారిపడ్డ లాలూ
  • భుజం, వెన్నెముకకు గాయాలు
  • పాట్నాలోని ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆసుప్రతిలో చేరారు. ఆదివారం పాట్నాలోని తన నివాసంలో ఆయన మెట్లపై నుంచి జారి పడిపోయారు. దాంతో, భుజం ఎముక విరగడంతో పాటు వెన్నెముకకు గాయాలయ్యాయి. దీంతో లాలూను సోమవారం తెల్లవారుజామున పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

74 ఏళ్ల లాలు ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 డిసెంబర్‌లో లాలుకు జైలు శిక్ష ఖరారైంది. ఈ ఏప్రిల్‌లో బెయిలుపై విడుదలైన తర్వాత ఢిల్లీలో ఉన్నారు. అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి కోలుకున్నారు.


More Telugu News