కేరళ సీఎం విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు
  • లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన పీసీ జార్జ్
  • తప్పుడు కేసులు పెట్టి తన భర్తను వేధిస్తున్నారని ఉషా జార్జ్ ఆవేదన
  • తన తండ్రి రివాల్వర్‌తో సీఎంను కాల్చేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరిక
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి, బెయిలుపై విడుదలైన కేరళకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను వేధిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తానని హెచ్చరించారు. తిరువనంతపురంలో నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తన భర్తను వేధిస్తున్నారని, దీని వెనక సీఎం ఉన్నారని ఆరోపించారు. 

సీఎం తన భర్తను, కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉషా జార్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అవినీతిని బయటపెట్టినందుకే అమాయకుడైన తన భర్తపై కక్షగట్టి అరెస్ట్ చేశారని అన్నారు. తన తండ్రి రివాల్వర్‌తో సీఎంను కాల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బహిరంగంగానే హెచ్చరించారు. కాగా, కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్‌పై జార్జ్ పలు ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త ఫారిస్ అబూబకర్‌తో ఆయనకున్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను అభ్యర్థించారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జార్జ్ ఆ వెంటనే బెయిలుపై విడుదలయ్యారు.


More Telugu News