ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మూడో రోజు ఆటలో విశేషాలు
- మ్యాచ్‌పై పట్టుబిగించిన భారత్
- మరోమారు విఫలమైన కోహ్లీ, విహారి, గిల్
- అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్న పుజారా
- 257 పరుగుల ఆధిక్యంలో బుమ్రా సేన
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టు (Rescheduled match)లో భారత జట్టు పట్టు బిగిస్తోంది. మూడో ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 132 పరుగులను కలుపుకుని భారత్ ఆధిక్యం 257 పరుగులకు చేరింది. 284 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (4) మరోమారు విఫలమయ్యాడు. తొలి ఓవర్ మూడో బంతికే పెవిలియన్ చేరాడు.
మరోవైపు, తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన చటేశ్వర్ పుజారా ఈసారి మాత్రం నిలదొక్కుకుని అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో ఉన్నాడు. హనుమ విహారి(11), కోహ్లీ (2) మరోమారు దారుణంగా నిరాశపరిచారు. అయితే, రిషభ్ పంత్ (30), పుజారా(50) క్రీజులో ఉండడంతో భారత్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 84/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొసాగించిన ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌటైంది. కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న బెయిర్‌స్టో శతకంతో ఆదుకున్నాడు. 119 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్న బెయిర్‌స్టో భారత్‌పై టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. స్టోక్స్ (25), శామ్ బిల్లింగ్స్ (36) కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఇంగ్లండ్ 284 పరుగులు సాధించగలిగింది. భారత బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు.