మ్యాచ్ పై పట్టు సాధించే దిశగా టీమిండియా

  • బర్మింగ్ హామ్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 284 ఆలౌట్
  • రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా
  • 28 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 75 రన్స్
బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు సాధించే దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్లకు 73 పరుగులు చేసింది. దాంతో టీమిండియా ఆధిక్యం 207 పరుగులకు పెరిగింది. టీమిండియా మరో 150 నుంచి 200 పరుగులు చేసినా చాలు... ఇంగ్లండ్ ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిలిపే అవకాశముంటుంది. ప్రస్తుతం క్రీజులో పుజారా (33 బ్యాటింగ్), కోహ్లీ (20 బ్యాటింగ్) ఉన్నారు. 

అంతకుముందు, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 4 పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్ అవుట్ కాగా, హనుమ విహారి (11) వికెట్ బ్రాడ్ ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది.


More Telugu News