రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొననున్న సీఎం జగన్
- అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉత్సవాలు
- హాజరుకానున్న మోదీ
- గన్నవరంలో ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం జగన్
రేపు (జులై 4) పశ్చిమ గోదావరి జిల్లాలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ప్రధాని పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.
రేపు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. ఉదయం 10.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పయనమవుతారు. ఉదయం 10.50 గంటలకు భీమవరం చేరుకుంటారు. ఆపై, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రధాని మోదీకి వీడ్కోలు పలకనున్నారు. అనంతరం, తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.