కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు స్థానం లేదు: జేపీ నడ్డా
- సికింద్రాబాద్ లో బీజేపీ విజయసంకల్ప సభ
- మోదీని చూసేందుకు భారీగా తరలివచ్చారన్న నడ్డా
- కేసీఆర్ సర్కారు పోవడం ఖాయమని ధీమా
- తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆరోపణ
తెలంగాణ గడ్డపై ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ప్రియతమ నేత నరేంద్ర మోదీని చూసేందుకు భాగ్యనగరానికి ఇంతమంది పోటెత్తారని వెల్లడించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం, బీజేపీ పాలన రావడం ఖాయమని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు బీజేపీకి కొత్త బలాన్ని ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు చోటు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని నడ్డా ఆరోపించారు.