బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హైదరాబాద్ ను 'భాగ్యనగర్' అని సంబోధించిన ప్రధాని మోదీ
- హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్వవర్గ సమావేశాలు
- హాజరైన ప్రధాని మోదీ
- వల్లభాయ్ పటేల్ భాగ్యనగర్ నుంచే ప్రారంభమైందని వెల్లడి
- ఐక్య భారత్ కు భాగ్యనగర్ లోనే పునాది పడిందని వివరణ
రెండ్రోజులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తోంది. పార్టీ ఉన్నతస్థాయి సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని 'భాగ్యనగర్' అని సంబోధించారు.
నాడు భారతదేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 'భాగ్యనగర్' నుంచే ప్రస్థానం ఆరంభించారని వెల్లడించారు. ఏకీకృత భారతావనికి పటేల్ 'భాగ్యనగర్' లోనే పునాదిరాయి వేశారని కీర్తించారు. ఇది మనందరికీ చారిత్రక ఘట్టం అని మోదీ అభివర్ణించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యతను బీజేపీ మోస్తుందని అన్నారు.